పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్‌) ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. కుళ్లిపోతున్న పదార్ధాలున్న చోట ఇవి సహజంగా పెరుగుతుంటాయి. ప్రత్యమ్నాయ మార్గాల్లోనూ వీటిని సాగుచేస్తున్నారు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. క్యాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో తినదగినవి, తినకూడనివి కూడా ఉంటాయి. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయి . కొన్ని రకాలు విటమిన్‌ ‘D’ ఉత్పత్తికి సహకరించేవిగా పనిచేస్తాయి.

రక్తపోటు నియంత్రణకు
పుట్టగొడుగులలో ఇర్గోథియోనైన్‌ , సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సీడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి తోడ్పడతాయి. శరీరంలో యధేచ్చగా సంచరిస్తూ.. డీఎన్ఏను దెబ్బతీస్తూ, గుండె జబ్బులకు, క్యాన్సర్ తదితర రోగాలకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను ఇవి ఎదుర్కొంటాయి. రక్తపోటు ఉన్నవారు, బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది. సగం కప్పు పుట్టగొడుగుల్లో 9 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి. పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది. రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి 5 సార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి.

పోషకాలు
ఒక కప్పు కట్ చేసిన మష్రూమ్ ముక్కల్లో 15 కేలోరీల శక్తి, 2.2 గ్రాముల ప్రోటీన్, 2.3 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.7 గ్రాముల ఫైబర్, 1.4 గ్రాముల చక్కెరలు ఉంటాయి. విటమిన్-బి, విటమిన్-బి2, ఫోలేట్ (బి9), థయమిన్ (బి1), పాంటోథెనిక్ యాసిడ్ (బి5), నియాసిన్ (బి3) పుష్కలంగా ఉంటాయి. బి విటమిన్లు మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపకరిస్తాయి. గర్భవతులకు ఇది మంచి ఆహారం.

ఊబకాయం నియంత్రణకు
పుట్టగొడుగుల నుంచి పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువ ఉండటం వల్ల బరువు పెరుగుతామన్న భయమే ఉండదు. ఊబకాయంతో బాధపడేవారికి ఇది ఉపకరిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే పొటాషియం.. పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. రైబోఫ్లావిన్‌, నియాసిన్‌లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి. మష్రూమ్స్‌లో ఉండే విటమిన్‌-ఈ, సెలీనియం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. వెంట్రుకల పోషణలో కూడా ఇవి ఉపకరిస్తాయి. శారీరక శక్తిని పెంపొందిస్తాయి.

Similar Posts

  • Health Benefits of phosphorus

    Next to calcium, phosphorus is the most abundant mineral in the body. These 2 important nutrients work closely together to build strong bones and teeth. About 85% of the body’s phosphorus is in bones and teeth. Phosphorous is also present in smaller amounts in cells and tissues throughout the body. Phosphorus helps filter out waste…

  • MilkyMushroom Facts

    మన ఆరోగ్యాన్నికాపాడుకోవడానికి పుట్టగొడుగులు చాలా సాయం చేస్తాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయట. అలాగే మరికొన్ని రకాల మష్రూమ్స్ విటమిన్‌ ‘D’ ఉత్పత్తికి సహకరిస్తాయట. అదేవిధంగా మష్రూమ్స్‌లో క్యాలరీలు తక్కువ గా ఉంటాయి.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి…..