ఆరోగ్య పరిరక్షణలో పుట్టగొడుగులు (మష్రూమ్స్) ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. కుళ్లిపోతున్న పదార్ధాలున్న చోట ఇవి సహజంగా పెరుగుతుంటాయి. ప్రత్యమ్నాయ మార్గాల్లోనూ వీటిని సాగుచేస్తున్నారు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. క్యాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల మిశ్రమ ఫలితాలు పొందుతారు. పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిల్లో తినదగినవి, తినకూడనివి కూడా ఉంటాయి. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్, బటన్ రకాలలో…