మన ఆరోగ్యాన్నికాపాడుకోవడానికి పుట్టగొడుగులు చాలా సాయం చేస్తాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయట. అలాగే మరికొన్ని రకాల మష్రూమ్స్ విటమిన్‌ ‘D’ ఉత్పత్తికి సహకరిస్తాయట. అదేవిధంగా మష్రూమ్స్‌లో క్యాలరీలు తక్కువ గా ఉంటాయి.. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.. అందుకనే వెయిట్ లాస్ డైట్‌లో ఎక్కువ మంది దీనిని తీసుకుంటుంటారు.మష్రూమ్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల ఇవి అరుగుదలకి సహకరిస్తాయి, మెటబాలిజం‌ని రెగ్యులేట్ చేస్తాయి.

మష్రూమ్స్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఎస్సెన్షియల్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. మష్రూమ్స్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువ ఉండటం వల్ల బరువు పెరుగుతామన్న భయమే ఉండదు. ఊబకాయంతో బాధపడేవారికి ఇది సహకరిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే పొటాషియం.. పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. మష్రూమ్స్‌లో ఉండే విటమిన్‌-ఈ, సెలీనియం ప్రోస్టేట్‌ కాన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి. వెంట్రుకల పోషణలో కూడా మష్రూమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మష్రూమ్స్ లో ఇర్గోథియోనైన్‌ , సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సీడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయ్. అదేవిధంగా మష్రూమ్స్‌లో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ సీ, డీ, వల్ల ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది, బాడీకి కావాల్సిన పోషణ లభిస్తుందట.

Mushroom Facts: రోజు తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడూ పుట్టగొడుగులు చేర్చడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. పుట్టగొడుగులలో పొటాషియం, ప్రోటీన్, రాగి, సెలీనియం, భాస్వరం, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు సి, బి, డి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.

పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలోని కాల్షియం ఎముకలను బలంగా చేస్తాయి. అంతేకాదు వీటిలో క్యాలరీలు తక్కువ. అంతేకాదు ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి లభిస్తుంది.పుట్టగొడుగులను వివిధ రకాల వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. వీటిని సూప్ మరియు సలాడ్లలో ఉపయోగిస్తారు, గుడ్లు వంటి ఇతర ఆహార పదార్థాలతో, ఆకలిని ప్రేరేపించడానికి, శాండ్‌విచ్‌లలో ఇతర కూరగాయలతో పాటు కలుపుతారు మరియు పిజ్జాల కోసం పాస్తా సాస్ మరియు టాపింగ్స్‌ను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పుట్టగొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి మరియు పొటాషియం మరియు సోడియం యొక్క మంచి సమతుల్యతను కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

Similar Posts